బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక: సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్‌

2021 Badvel By-Election, 2021 Badvel Bypolls, Andhra’s Badvel Assembly bypoll, Badvel, Badvel Assembly By Poll, Badvel Assembly By Poll Begins, Badvel Assembly By Poll Begins In AP, Badvel Assembly By Poll Begins In AP Tough Fight Between TDP-BJP-YSRCP For MLA Seat, Badvel Assembly By-election, Badvel Assembly By-election Live Updates, Badvel Assembly constituency, Badvel By-Election Latest News, Mango News, Polling Underway in 281Centers

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బద్వేలు నియోజకవర్గపరిధిలోని 7 మండలాల్లో మొత్తం 281 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఏడు గంటలకు ముగియనుంది. మరోవైపు ఈ ఉపఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని, ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని ఏపీ సీఈవో విజయానంద్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

–> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 281 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్స్, మాస్కులు, పీపీఈ కిట్లు సహా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా, 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో మరింత బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉపఎన్నికలో 2,15,292 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఉదయం 9 గంటల వరకు 10.49% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

–> బద్వేలు పోరులో 15 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోరు నెలకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలవగా, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. కాగా మృతి చెందిన ఎమ్మెల్యే సతీమణికే వైఎస్సార్సీపీ టికెట్ కేటాయించిన నేపథ్యంలో సంప్రదాయాలను గౌరవిస్తూ బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఉపఎన్నికలో మూడు పార్టీల కీలక నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఇక నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాన్ని వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + one =