నవంబర్ 30 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

DGCA Extends Ban On International Passenger Flights, DGCA Extends International Passenger flights Ban, DGCA Extends International Passenger Flights Ban till November 30, India Extends Ban On International Flights, India extends ban on scheduled, India Extends Ban On Scheduled International Flights, International Flight Ban Extended till November 30, International Passenger Flights Ban, Mango News, Suspension of scheduled international flights extended, Suspension on International flights extended

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం నుంచి అమల్లో ఉన్న అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై నిషేధం గడువును తాజాగా నవంబర్ 30 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ నవంబర్ 30, 2021 అర్ధరాత్రి 23.59 గంటల వరకు విమాన సర్వీసులపై నిషేధం విధిస్తునట్లుగా డీజీసీఏ శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే అంతర్జాతీయ కార్గో విమాన సేవలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. అలాగే సమర్థ అధికారం ఆధారంగా కేస్ టూ కేస్ బేసిస్ లో ఎంపిక చేసిన కొన్ని రూట్లు/దేశాలకు అంతర్జాతీయంగా షెడ్యూల్ చేసిన విమాన సర్వీసులను అనుమతించే అవకాశం ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =