హుజూరాబాద్ ఉపఎన్నిక : సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌

Huzurabad Assembly By-election Live Updates, Huzurabad Assembly By Poll, Huzurabad Assembly By Poll Underway, Huzurabad By Election Voting Live, Huzurabad by-election, Huzurabad By-election Polling, Huzurabad bypoll, Huzurabad bypoll 2021, Huzurabad bypoll News, Huzurabad bypoll Today, Mango News, Polling At 306 Centres 2.37 Lakh Voters Eligible To Vote, Polling for Huzurabad by-election begins, Telangana Huzurabad bye-poll, Telangana Huzurabad bypoll

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో మొత్తం 306 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు హుజురాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ సీహెఛ్ రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఏడు గంటలకు ముగియనుంది.

మరోవైపు కమలాపూర్ మండల కేంద్రంలోని 262 పోలింగ్ బూత్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తన సతీమణి జమునతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్‌ నగర్‌ లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

–> కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 306 పోలింగ్‌ కేంద్రాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఈ ఉపఎన్నికలో 2,37,036 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. కాగా ఉదయం 9 గంటల వరకు 10.50% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

–> హుజూరాబాద్ పోరులో 30 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్‌ నర్సింగ్ రావు ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది. ఇక నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక వివరాలు:

  • పోలింగ్‌ తేదీ : అక్టోబర్ 30
  • మొత్తం ఓటర్లు : 2,37,036
  • పురుష ఓటర్లు : 1,17,933
  • మహిళా ఓటర్లు : 1,19,102
  • పోలింగ్ కేంద్రాలు : 306
  • పోలింగ్ సిబ్బంది : 1715
  • పోలింగ్ బలగాలు : 3865
  • పోలింగ్ సమయం : శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు
  • ఫలితాలు వెల్లడి : నవంబర్ 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 10 =