బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

Btech Student Ramya Assassination Incident Capital Punishment for Convict Shashi Krishna, Guntur court announces sensational death sentence to convict Shashi Krishna, Btech Student Ramya Assassination Incident, Capital Punishment for Convict Shashi Krishna, 20-year-old Btech Student, Ramya 20-year-old Btech Student, Ramya Assassination Incident, Ramya Assassination Incident News, Ramya Assassination Incident Latest News, Ramya Assassination Incident Latest Updates, Ramya Assassination Incident Live Updates, Capital Punishment for Convict, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆగస్టు 15, 2021న జరిగిన బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడైన శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రమ్యను శశికృష్ణ హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు రుజువు కావడంతో అతడిని హంతకుడిగా తేల్చుతూ, ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా కోర్టు తీర్పు వెల్లడించింది.

ముందుగా రమ్య హత్య ఘటన అనంతరం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. మరుసటిరోజే పారిపోతున్న నిందితుడు శశికృష్ణను ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీ వెంబడించి పట్టుకోగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ గత ఏడాది డిసెంబర్‌ లో ప్రారంభం కాగా, ఏప్రిల్ 26, 2022తో కోర్టులో విచారణ ముగిసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కోర్టు పలువురు సాక్షుల నుంచి వాంగూల్మం సేకరణ, సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించింది. ఈ కేసులో విచారణను 9 నెలల సమయంలోనే పూర్తిచేసి తీర్పు ప్రకటించింది. నిందితుడిలో ఎలాంటి పశ్చాతాపం కనిపించడం లేదని, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పారిపోయేందుకు కూడా ప్రయత్నించాడని, ఇలా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుని నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తున్నట్టు ఫాస్ట్‌ ట్రాక్‌ న్యాయమూర్తి ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =