సొంత పార్టీ నేతలే టార్గెట్‌ చేస్తున్నారంటూ.. భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని

Former Minister Balineni Srinivasa Reddy Gets Emotional While Talking To Press at Ongole,Former Minister Balineni Srinivasa Reddy,Balineni Srinivasa Reddy Gets Emotional,Balineni Srinivasa Reddy Gets Emotional Support,Mango News,Mango News Telugu,Balineni Breaks Down In Tears In Press Meet,Balineni Srinivasa Reddy Press Meet At Ongole,Ongole MLA balineni Srinivas Reddy,YCP Balineni Srinivasa Reddy Cries in Press Meet,Former Minister Balineni Srinivasa Reddy,Srinivasa Reddy Latest News And Updates

తనపై సొంత పార్టీ లోని నేతలే దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎందుకు వారు అలా చేస్తున్నారో తెలియడం లేదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వాపోయారు. తన నియోజకవర్గంపై దృష్టి పెట్టేందుకే ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానని, అంతకుమించి ఇంకేం కారణాలు లేవని అన్నారు. అయితే తనను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసని, పనికట్టుకుని వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆ కృతజ్ఞతతోనే జగన్ వెంట నడిచానని, కానీ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం తనపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన గోనె ప్రకాశరావు తన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన బాలినేని.. తనపై వస్తున్న నిందలు, ఆరోపణలు భరించలేకపోతున్నానని, తాను తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

ఇక తాను టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వైసీపీ నాయకులే ప్రచారం చేస్తున్నారని.. అవి కేవలం అభూత కల్పనలేనని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని, చివరి వరకు వైఎస్‌ కుటుంబంతో ఉంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎవరు వచ్చి ఏ పని కావాలన్నా తనకు చేతనైనంత సాయం చేస్తానని, ఎవరితోనూ తనకు విభేదాలు లేవని చెప్పారు. వైసీపీని నాశనం చేయడానికి కొందరు నేతలు ప్రయత్నం చేస్తున్నారని, అయితే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇక ఒంగోలు డీఎస్పీ నియామకం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని, ప్రాంతీయ సమన్వయకర్తగా చేయలేనని చెప్పానని ఆయనకే తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =