దేవినేని చందుకే టీడీపీ పెనమలూరు టికెట్..

Devineni chandrasekhar, tdp, penamalur tdp ticket, devineni uma, ap elections,assembly elections,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics,AP,AP Political updates,chandrababu,Mango News Telugu,Mango News
Devineni chandrasekhar, tdp, penamalur tdp ticket, devineni uma, ap elections

ఉమ్మడి కృష్ణాజిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం.. విజయవాడకు అతి సమీపంలోవున్న స్థానం పెనమలూరు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా పెనమలూరును దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి జోగి రమేష్ గౌడ్‌ను వైసీపీ బరిలోకి దింపుతోంది. 2014 ఎన్నికల్లో పెనమలూరులో తెలుగు దేశం పార్టీ జెండా పాతింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనైనా పెనమలూరులో గెలుపొంది తీరాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. జోగి రమేష్‌ను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది.

అయితే టీడీపీలో పెనమలూరు టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. దేవినేని ఉమామహేశ్వరరావు, దేశినేని చంద్రశేఖర్(చందు)లతో పాటు మరికొందరు నేతలు పెనమలూరు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. వాస్తవానికి దేవినేని ఉమ ముందుగా మైలవరం టికెట్ ఆశించారు. కానీ మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయనున్నారు.

దీంతో నిరాశ చెందిన దేశినేని ఉమ.. పెనమలూరుపై కన్నేశారు. ఆ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు దేవినేని చంద్రశేఖర్ కూడా పెనమలూరు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దేశినేని ఉమావైపు కాకుండా.. చంద్రశేఖర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్‌ను ఢీ కొట్టాలంటే.. అది దేవినేని చంద్రశేఖర్‌తోనే అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. నియోజకవర్గంలో కూడా చంద్రశేఖర్‌కు మంచి బలం, బలగం ఉంది. యూత్ అంతా చంద్రశేఖర్ వైపే ఉన్నారు.

ఈక్రమంలో దేవినేని చంద్రశేఖర్‌ను పెనమలూరు నుంచి బరిలోకి దించడం ద్వారా ఆ స్థానాన్ని సులువుగా గెలుచుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లతో చంద్రశేఖర్‌ సమావేశమయ్యారు. పెనమలూరులో ప్రస్తుత పరిస్థితులు, చంద్రశేఖర్‌కు టికెట్ ఇవ్వడంపై చర్చలు జరిపారు. చివరికి చంద్రశేఖర్‌కే పెనమలూరు టికెట్ అనే సంకేతాలు ఇచ్చారట చంద్రబాబు నాయుడు. దీంతో వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి టీడీపీ తరుపున దేవినేని చంద్రశేఖర్ బరిలోకి దిగనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 16 =