ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Chandrababu Meeting With Khammam District, Chandrababu Meeting With Khammam District Leaders, Chandrababu Meeting With Khammam District Party Leaders, Chandrababu Meeting With Khammam District Party Leaders and Workers, Chandrababu Naidu Latest News, Chandrababu Naidu Meeting With Khammam District Party Leaders, Mango News Telugu

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, పార్టీ భవిష్యత్ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణను పట్టించుకోవడం లేదనే విమర్శలు కరెక్ట్ కాదని, త్వరలోనే తెలంగాణలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. తాను ముందు చూపుతో ఆలోచించి,కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసానని చెప్పారు. నాడు తాను చేసిన అభివృద్దే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారాయని అన్నారు.

తెలంగాణాలో నాయకులు వేరే పార్టీలకు వెళ్లారు కానీ, కార్యకర్తలు పార్టీని వీడలేదని చెప్పారు. తాను ఆశాజీవినని, అధైర్యపడకుండా ముందుకు సాగుతానని నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉండడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లిందని విమర్శించారు. రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తే, నేడు అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేసారని అన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఎంతో కష్టపడితే, ఈ పరిస్థితి ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నానని కార్యకర్తలతో అన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=Mjomk8IzrLw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =