క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన అజంతా మెండిస్

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, Ajantha Mendis Retired From All Forms Of Cricket, Ajantha Mendis Retires, Ajantha Mendis Retires From All Forms Of Cricket, Ajantha Mendis Retires From Cricket, Latest Sport News And Headlines, Latest Sport News And Updates, latest sports news, latest sports news 2019, Mango News, Mango News Telugu, sports news

శ్రీలంక స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరుగాంచిన అజంతా మెండిస్ క్యారమ్ బంతులతో బ్యాట్స్‌మెన్‌ ను ఇబ్బంది పెట్టేవాడు. శ్రీలంక తరుపున 19 టెస్టులు, 87 వన్డేలు, 39 టి-20 మ్యాచులు ఆడాడు. శ్రీలంక తరుపున అజంతా మెండిస్ ఆఖరి మ్యాచ్ 2015లో ఆడాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతూ రాణిస్తున్నప్పటికి, శ్రీలంక బోర్డు జట్టులో చోటు కల్పించకపోవడంతో నిరాశ చెంది అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 సంవత్సరాల అజంతా మెండిస్ కెరీర్లో ఎక్కువగా గాయాల బారిన పడి ఇబ్బందులు ఎదురుకున్నాడు.

అజంతా మెండిస్ తన తోలి సిరీస్ లోనే భారత బ్యాట్స్‌మెన్‌ను తన క్యారమ్ బంతులతో అయోమయానికి గురిచేశాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో 26 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. తర్వాత మ్యాచ్ లలో మెండిస్ బౌలింగ్ మిస్టరీని బ్యాట్స్‌మెన్‌ ఛేదించడంతో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. టెస్టుల్లో 70 , వన్డేల్లో 152 , టి-20 మ్యాచుల్లో 66 వికెట్లు తీసి అన్ని ఫార్మాట్లలో 288 వికెట్లు తీసాడు. టి-20 క్రికెట్లో రెండు సార్లు 6 వికెట్లు సాధించిన ఒకేఒక బౌలర్ గా మెండిస్ ఘనత సాధించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 16 =