ఆర్టికల్-370 పిటిషన్లపై అక్టోబర్ లో విచారణ

#Article370, Abrogation Of Article-370, article 35a and 370, article 35a history, article 35a in kashmir, article 35a jammu and kashmir, article 35a kashmir, article 370 and article 35a, article 370 jammu and kashmir, article 370 kashmir, Jammu and Kashmir, jammu and kashmir news, Petitions Filed Against Scrapping Of Article 370, SC To Hear Petitions Filed Against Scrapping Of Article 370, scrapping of Article 370, special status to Jammu and Kashmir, Supreme Court to Hear Pleas Against Abrogation Of Article-370, what is article 35a, what is article 370

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన అంశాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై, ఆగస్టు 28 బుధవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కశ్మీర్ కు సంబంధించి దాఖలైన మొత్తం 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్-370 రద్దుపై దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులులో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై వారి స్పందన తెలియజేయాలంటూ కేంద్రప్రభుత్వానికి, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ మొదటివారం నుంచి పూర్తి స్థాయిలో ఈ పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని వెల్లడించారు.                                                                                                                                                                                                                                                                                                  జమ్మూ కశ్మీర్ లో మీడియాపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలని వేసిన పిటిషన్ కూడ విచారణకు వచ్చింది. వారం రోజుల పాటు గడువు విధించి, ఈ పిటిషన్ కు సంబంధించి వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్-370 రద్దు తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనసాగించిన ఆంక్షలపై గతంలోనే విచారణ చేపట్టి, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకోగా, ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయని పిటిషన్లు రావడంతో తాజాగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here