ఉన్న పార్టీలో ఉండలేక.. పక్క పార్టీలు పట్టించుకోక.. ఊగిసలాటలో ఎంపీ వివేక్

Not being able to stay in the existing party Ignoring the neighboring parties MP Vivek is swinging,Not being able to stay in the existing party,Ignoring the neighboring parties,MP Vivek is swinging,Mango News,Mango News Telugu,Bharatiya Janata Party,MP vivek, bjp, congress, telangana politics,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,MP vivek Latest News,MP vivek Latest Updates,MP vivek Live News

ఎన్నికలవేళ జంపింగ్ జపాంగ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. టికెట్ దక్కక.. పార్టీలో సరైన గుర్తింపు లేక నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ ఆశించి కొందరు నేతలు పార్టీలు మారుతుంటే.. మరికొందరు  పదవులకు ఆశపడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరి పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది. ఉన్న పార్టీలో సరైన గుర్తింపు లేక.. పొరుగు పార్టీలు పట్టించుకోక.. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్‌లో ఉన్నారు.

కొద్దిరోజులుగా మాజీ ఎంపీ వివేక్‌కు బీజేపీలో ప్రధాన్యత తగ్గిపోయింది. ఆయన కూడా పార్టీ వ్యవహారాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ ఆయన కనిపించలేదు. అంతేకాకుండా ఆయన కోరుకున్నట్లుగా టికెట్ల పంపిణీ లేకపోవడంతో గుర్రుగా ఉన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి కూడా దూరంగా ఉంటున్నారు. వారిద్దరి మధ్య వ్యవహారాలు అంటీముట్టనట్లుగా నడుస్తున్నాయి. అటు అధిష్టానం కూడా అన్ని విషయాల్లో వివేక్‌ను లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కొద్దిరోజులుగా వివేక్ బీజేపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. అటు పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో వివేక్ కూడా.. అవకాశం వస్తే పార్టీ మారే యోచనలో ఉన్నారట. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ఆలోచనలో  ఉన్నారట. గతంలో వివేక్ కాంగ్రెస్‌లో చక్రం తిప్పారు. అప్పట్లో ఆయనకు మంచి ప్రధాన్యత ఉండేది. ఎప్పుడైతే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారో.. అప్పటి నుంచి ఆయనకు తగిన ప్రధాన్యత లేకుండా పోయింది.

అటు తిరిగి పార్టీలో చేరుతానని వివేక్.. కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ రెడ్డికి కబురు చేశారట. కానీ వారు వివేక్ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదట. వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవపడంతో.. పార్టీ మార్పుపై వివేక్ తర్జన భర్జన పడుతున్నారట. మరి కాంగ్రెస్ తిరిగి వివేక్‌ను చేర్చుకుంటుందా? లేదా?.. వివేక్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =