జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

Chandrababus Strong Counter on Jagans Comments, Chandrababus Strong Counter, Strong Counter Chandrababu, Strong Counter on Jagans Comments, Chandrababu Naidu, Telugu desam party, Chandrababu Naidu Comments, Latest Chandrababus Counter News, Chandrababus Counter, Latest TDP Chandrababu News, AP YCP, YCP News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Chandrababu naidu, Telugu desam party, chandrababu naidu comments

ఫైనల్‌గా వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇన్నిరోజులుగా వస్తోన్న ఊహాగాణాలకు తెర దించుతూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అయితే అంతకంటే ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రతిపక్షాలు.. కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతాయని వ్యాఖ్యానించారు. కాకినాడలో జరిగిన సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతుండడంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు.  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ ఇంట్లో మీరే చిచ్చు పెట్టుకొని తమపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మీ ఇంట్లో చిచ్చు పెట్టాల్సిన అవసరం తమకు ఏముందని నిలదీశారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని జగన్ సరిగా చూసుకోలేకపోతే తమకేం సంబంధం అని అన్నారు. ఏదో రకంగా ఇతరులపై బురదజల్లి బతకడం కూడా రాజకీయమేనా అని విమర్శించారు.   ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల.. ఇప్పుడు రివర్స్ గేర్ వేసి తిరుగుతోందని ఆరోపించారు.

అసలు జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం కూడా తనకు ఇష్టం లేదన్న చంద్రబాబు.. ప్రభుత్వ కార్యక్రమం పెట్టి రాజకీయ పార్టీలను విమర్శించారు కాబట్టే తాను స్పందిస్తున్నానని స్పష్టం చేశారు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఎంత ప్రయత్నించినప్పటికీ అమరావతిని మార్చడం జగన్ వల్ల కాలేదు.. ఇకపై కూడా కాదన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జగన్ మాజీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈసారి తప్పకుండా తాము అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వచ్చాక నిధులు, విధులకు సంబంధించి సర్పంచ్‌లకు సర్వ అధికారాలు కల్పించేలా 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేసి తీరుతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులను పంచాయితీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆ నిధులను 10 శాతానికి పెంచుతామన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =