సంచలన బాంబు పేల్చిన చింతా మోహన్

Chinta Mohan Who Exploded the Sensational Bomb, Who Exploded the Sensational Bomb, Chinta Mohan Who Exploded Bomb, Chinta Mohan Sensational Bomb, AP Politics, Congress, Chinta Mohan, YCP Leaders, Latest Chinta Mohan News, Chinta Mohan News Update, Chinta Mohan AP News, Chinta Mohan YCP News, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
AP Politics, Congress, Chinta Mohan, YCP Leaders

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. క్రమంగా ఏపీపై కూడా పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో  విలీనం చేసి ఆ పార్టీలో చేరిపోయారు. షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏపీపీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరడం.. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలొస్తుండడంతో.. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

ఇప్పటికే వైసీపీ అధినేత జగన్.. పార్టీ ఇంఛార్జ్‌ల మార్పు అంశం రాష్ట్రంలో కాకరేపుతోంది. 11 మంది ఇంఛార్జ్‌లను ఒకసారి.. 27 మంది ఇంఛార్జ్‌లను మరోసారి జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. దీంతో ఇక తమకు టికెట్ దక్కదని భావించిన సిట్టింగ్‌లు, ఆశావాహులంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల మధ్య తెలుగు దేశం, జనసేన పార్టీల్లో జాయిన్ అయినప్పటికీ టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఆయా స్థానాలకు టీడీపీ, జనసేన నుంచి బలమైన నేతలు పోటీ పడుతున్నారు.

ఈక్రమంలో ఆయా పార్టీల్లో చేరినా టికెట్ దక్కదని అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి తన పదవికి రాజీనామా చేసేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తాను కూడా ఆమె వెంటే నడుస్తానని ప్రకటించారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈక్రమంలో ఆర్కే కూడా రేపో.. మాపో కాంగ్రెస్‌లో చేరనున్నారు. అటు వైసీపీ నేత మల్లాది విష్ణు కూడా ఆర్కే బాటలో షర్మిల వైపు చూస్తున్నారు.

ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన బాంబు పేల్చారు. ఒక్కరిద్దరు కాదు వైసీపీకి చెందిన 33 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారందరినీ తాము కలిశామని.. వారందరినీ తిరిగి సొంత గూటికి ఆహ్వానించామని చెప్పారు. ఇతర పార్టీల్లో ఉ్ననవారితో పాటు వైసీపీలో ఉన్న 33 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =