ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలికిన సీఎం జగన్

2019 AP News, AP CM Jagan Speech At Diplomatic Outreach Meeting In Vijayawada, AP Political Updates, CM Jagan Speech At Diplomatic Outreach Meeting, CM Jagan Speech At Diplomatic Outreach Meeting In Vijayawada, CM YS Jagan Speech At Diplomatic Outreach Meeting In Vijayawada, Jagan Speech At Diplomatic Outreach Meeting In Vijayawada, Mango News Telugu, YS Jagan Speech At Diplomatic Outreach Meeting In Vijayawada

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 9, శుక్రవారం నాడు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహనా సదస్సులో ఉపన్యాసం చేసారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దాదాపు 35 దేశాల నుండి ప్రతినిధులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. తమ ప్రభుత్వం రెండు నెలల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని, పారదర్శక పాలనతో ముందుకు వెళ్తున్నదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానం పలుకుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం మాకున్న అనుకూలం అని సీఎం జగన్ చెప్పారు. ఢిల్లీ తరువాత ఈ స్థాయిలో ఇంత మంది దౌత్యవేత్తలు రాష్ట్రంలో సమావేశమవడం ఇదే తొలిసారి అని భావిస్తున్నా, ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు కేంద్రప్రభుత్వానికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను విదేశీ ప్రతినిధులకు వివరించారు. అంతే కాకుండా విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలనీ తీసుకున్న నిర్ణయం, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలపై ప్రసంగంలో వివరించారు. ఇక్కడ స్థాపించే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం కావాల్సిన అర్హతలు తెలుసుకుని, ఇంజనీరింగ్ కాలేజీల్లో తగిన శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక పధకాలు రూపొందిస్తుందని చెప్పారు. పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులకు మీ నుంచి సహాయ సహకారాలు కావాలని దౌత్య వేత్తలను కోరారు. తమ ప్రభుత్వానికి కేంద్రంతో, పొరుగురాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=qCwkZn9WJZY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 5 =