జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం

#Article370, article 35a and 370, article 35a history, article 35a in kashmir, article 35a kashmir, article 370 debate, article 370 issue, article 370 jammu and kashmir, article 370 kashmir, Article 370 Revoked, Jammu and Kashmir, Ladakh, Mango News, mehbooba mufti on article 370, PM Modi Speech, PM Modi Speech About Article 370, Prime Minister Narendra Modi, what is article 35a, what is article 370

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో అందుకు దారితీసిన పరిస్థితులు, వీటి ద్వారా కశ్మీర్ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ప్రధాని మోడీ ప్రజలకు వివరించారు. 40 నిమిషాలపాటు ప్రసంగించిన మోడీ , కశ్మీర్ ప్రజలకు నమ్మకం కలిగేలా త్వరలోనే మంచి రోజులు వస్తాయని సందేశం ఇచ్చారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో ముఖ్యంశాలు:

  • ఒక దేశంగా, ఒక కుటుంబంగా జమ్మూ కశ్మీర్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము
  • జమ్మూ కశ్మీర్ మరియు లద్దాఖ్ సోదరులు మరియు సోదరీమణులు అనేక హక్కులను కోల్పోయారు, వారి అభివృద్ధికి అవరోధముగా ఉన్న అంశం ఇప్పుడు తొలిగిపోయింది
  • సర్దార్ పటేల్, అంబేద్కర్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారి వాజపేయి లతో పాటు కోట్ల మంది దేశభక్తులు కల ఇప్పుడు నిజమైంది
  • ప్రాధాన్యత విషయంలో, పోలీసులతో సహా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టిసి, హెచ్ఆర్ఎ, విద్య మరియు ఆరోగ్య ప్రయోజనాలు వంటి అంశాలు ఇతర రాష్ట్రాలలోని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే లభిస్తాయి
  • కశ్మీర్ ప్రజలందరికి న్యాయం జరుగుతుంది
  • కశ్మీర్ ప్రజలందరికి సమాన హక్కులు, బాధ్యతలు మొదలయ్యాయి
  • త్వరలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వం న్యాయమైన ఎన్నికలు నిర్వహిస్తుందని, జమ్మూ కశ్మీర్ పౌరులు తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు
  • అసెంబ్లీ కి జరిగే ఎన్నికలలో యువతీ యువకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పారు
  • ఆర్టికల్- 370 వలన జమ్మూ కశ్మీర్ కు ఒరిగిందేమి లేదని, ప్రజల్లో వ్యతిరేక భావనలు ఏర్పరచేందుకు పాకిస్తాన్ దీన్నొక ఆయుధంలా వాడుకుంది
  • దాని ఫలితంగా మూడు దశాబ్దాల్లో 42 వేల మంది అమాయకులు బలయ్యారు.
  • జమ్మూ కశ్మీర్ పునర్విభజన పై ఏంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయంతో ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది, భవిష్యత్ లో అనేక కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి
  • జమ్మూ కశ్మీర్ గొప్ప పర్యాటక కేంద్రంగా ఉన్నందున, పర్యాటక పరంగా చాల ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది
  • జమ్మూ కశ్మీర్ లో లభించే కుంకుమపువ్వు, ఆపిల్, కహ్వా వంటి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని ఆయన అన్నారు.
  • బాలీవుడ్ చిత్రనిర్మాతలకు కశ్మీర్ అభిమాన గమ్యస్థానంగా ఉంది, భవిష్యత్తులో టాలీవుడ్, కోలీవుడ్, అంతర్జాతీయ చిత్రాలు కూడా అక్కడ చిత్రీకరించబడతాయని నాకు నమ్మకం ఉంది.
  • ఆర్థిక, సామాజిక మరియు మౌలిక సదుపాయాల వంటి ఇతర పరిణామాలు కూడా ఈ ప్రాంతంలో సాధ్యమవుతాయి.
  • నూతన భారతదేశంతో పాటు సరికొత్త జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లను నిర్మిద్దాం
  • జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ లకు సరికొత్తగా మార్గం చూపడానికి అందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి 

 

[subscribe]
[youtube_video videoid=9pYrlFEdUsA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =