నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Naidu To Attends Several Roadshows in Vijayanagaram District Today, Chandrababu Naidu To Attends Several Roadshows in Vijayanagaram District Today, TDP Chief To Attends Several Roadshows in Vijayanagaram District Today, TDP Chief Nara Chandrababu Naidu To Attends Several Roadshows in Vijayanagaram District Today, TDP President Nara Chandrababu Naidu To Attends Several Roadshows in Vijayanagaram District Today, Nara Chandrababu Naidu To Attends Several Roadshows in Vijayanagaram District Today, Several Roadshows in Vijayanagaram District Today, Vijayanagaram District Roadshows, Vijayanagaram District, TDP President Nara Chandrababu Naidu, TDP Chief Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, Nara Chandrababu Naidu Vijayanagaram Tour, Chandrababu Naidu Vijayanagaram Tour, TDP Chief Vijayanagaram Tour, Vijayanagaram Tour, Nara Chandrababu Naidu Vijayanagaram Tour News, Nara Chandrababu Naidu Vijayanagaram Tour Latest News, Nara Chandrababu Naidu Vijayanagaram Tour Latest Updates, Nara Chandrababu Naidu Vijayanagaram Tour Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే విజయనగరం పర్యటనకు తక్కువ సమయం కేటాయించడంతో చంద్రబాబు రోడ్‌ షోలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో శుక్రవారం రోడ్‌షోలు నిర్వహించనున్నారు. తొలుత విజయనగరం మీదుగా తన యాత్ర ప్రారంభించనున్న చంద్రబాబు అనంతరం నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాలలో రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇటీవల ఒంగోలులో జరిగిన ‘మహానాడు’ విజయవంతమైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సభలకు, మీటింగులకు జనం భారీగా హాజరవుతున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా అనకాపల్లి మినీ మహానాడును వారు గుర్తుచేస్తున్నారు. దీంతో ఈరోజు పర్యటనను కూడా భారీగా నిర్వహించాలని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోగాపురం మీదుగా డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చివరగా చీపురుపల్లి చేరుకోనున్నారు. ఈ క్రమంలో యాత్ర మధ్యలో కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద స్థానిక ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here