వైఎస్ఆర్ ఆసరా కింద 78.94 లక్షల మంది మహిళలకు రూ.6,149 కోట్లు.. ఈనెల 25న దెందులూరులో పంపిణీ చేయనున్న సీఎం జగన్

CM Jagan To Release Over Rs 6149 Cr For 78.94 Lakhs Dwakra Women Under YSR Asara On March 25Th At Denduluru,CM Jagan To Release Over Rs 6149 Cr,CM Jagan 78.94 Lakhs Dwakra Women Under YSR Asara,YSR Asara On March 25Th At Denduluru,Mango News,Mango News Telugu,YSR Asara Scheme,AP CM Ys Jagan Mohan Reddy,YSR Party,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News And Live Updates,AP Dwakra Women Latest News,CM Jagan YSR Asara Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. త్వరలోనే వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను వారి ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందలూరులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే 2 విడతలుగా రూ.12,758 కోట్లు అర్హుల ఖాతాల్లో జమ చేయగా.. మూడో విడత కింద సీఎం జగన్‌ చేతుల మీదుగా 78.94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో మరో రూ.6,149 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 25నుంచి ఏప్రిల్ 5 వరకు దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల నేతృత్వంలో నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

కాగా 2023-24 సంవత్సరానికి గాను 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.6,700 కోట్లు కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేటాయింపులను ప్రతిపాదించారు. ఏప్రిల్ 11, 2019 న, ప్రభుత్వం 4 విడతలుగా గ్రామీణ మరియు పట్టణ పేద మహిళా స్వయం సహాయక బృందాల బకాయి బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 78.94 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళా లబ్దిదారులకు మూడు విడతల్లో రూ.19,137 కోట్లు మాఫీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =