ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో పింఛన్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో ‘వైఎస్సార్ చేయూత’ మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద వరుసగా మూడో ఏడాది రూ. 4,949 కోట్ల రుపాయల నగదును 26,39,706 మంది మహిళల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వచ్చే జనవరి నుంచి పెన్షన్లను పెంచటానికి నిర్ణయించుకున్నామని, ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,500లను రూ.2,750కి పెంచుబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అలాగే ఈ పథకం కింద రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి రూ.75 వేలు వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్ధిక సాయం అందిస్తామని, మూడో విడత పంపిణీ ద్వారా ఇప్పటి వరకు రూ.56వేలు చెల్లించినట్లు ఆయన గుర్తు చేశారు. కుప్పంలోని ప్రతి మండలంలో వారం రోజుల పాటు చేయూత ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి.. ఈ కార్యక్రమం ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, సర్పంచులు, అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు మండలాలకు వచ్చి ప్రజలను నేరుగా కలుసుకుంటారని వెల్లడించారు. ఇక కుప్పం అంటే ఇకపై చంద్రబాబు పాలన కాదని, అన్ని వర్గాల అభివృద్ధి అని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు 33ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గానికి మాత్రం ఏమి చేయలేదని, కుప్పం నుంచి బెంగళూరు, చెన్నై పట్టణాలకు యువత భారీగా వలసలు పోతున్నా వారికి ఉపాధి కల్పించాలనే ఆలోచనే ఆయనకు రాలేదని సీఎం జగన్ విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY