చంద్రబాబుకు ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్

Relief For Chandrababu Early Bail In Three Cases, Relief For Chandrababu, Early Bail In Three Cases, Chandrababu Early Bail, Chandrababu Naidu, Chandrababu Got Bail, AP Highcourt, AP CID, Latest Chandrababu Bail News, Chandrababu Bail News Update, Chandrababu Bail Update, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Chandrababu naidu, Chandrababu got bail, AP Highcourt, AP CID

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోన్న చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఊరట కల్పించింది. మూడు కేసుల్లో షరుతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను చంద్రబాబుకు మంజూర్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబుకు ఈ సమయంలో బెయిల్ రావడంతో బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది.

ఇటీవల స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏపీ సీఐడీ కోర్టు చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో కోర్టు బాబుకు బెయిల్ మంజూర్ చేసింది. అయితే స్కిల్ స్కామ్ కేసుతో పాటు చంద్రబాబుపై మరో మూడు కేసులను ఏపీ సీఐడీ నమోదు చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ చంద్రబాబుపై అభియోగాలు మోపింది. ఈ మేరకు ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా సీఐడీ పేర్కొంది. అలాగే ఇసుక పాలసీకి  సంబంధించి కూడా చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇసుక పాలసీకి సంబంధించి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా మద్యం కేసులో కూడా చంద్రబాబును సీఐడీ ఏ-3గా పేర్కొంది.

అయితే ఈ మూడు కేసులకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తాజాగా ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది. మూడు కేసుల్లో షరుతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి చంద్రబాబును విచారించాలని సీఐడీ భావిస్తే.. నిర్ధిష్ట కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twelve =