నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు?

Telangana ED Issues Notices To T Congress Leaders in National Herald Case, ED Issues Notices To T-Congress Leaders, ED Issues Notices on National Herald Case, Telangana ED Issues Notices, Telangana ED Issues Notices To T-Congress Leaders, Mango News, Mango News Telugu, National Herald Case, National Herald Corruption Case, National Herald Case Latest News And Updates, T-Congress Leaders Got ED Notices, Telangana ED, ED National Herald Case, Directorate of Enforcement, Enforcement Directorate

కాంగ్రెస్ పార్టీలో నేషనల్‌ హెరాల్డ్‌ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 8 మంది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేణుకా చౌదరి, గీతారెడ్డితో పాటుగా మరో నలుగురికి నోటీసులు జారీ చేసిందని, అక్టోబర్‌ 10న వీరు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరినట్లు సమాచారం.

అయితే దీనిపై గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా విచారణకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు. కాగా నేషనల్‌ హెరాల్డ్‌కు డొనేషన్‌ ఇచ్చిన మాట వాస్తవమేనని, అదికూడా చెక్‌ రూపంలోనే అందించామని, అందులో తప్పేం లేదని షబ్బీర్‌ అలీ, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ వివరించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దీనిపై స్పందిస్తూ.. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించి తనకు ఎలాంటి నోటీసు అందలేదని, ఈ కేసులో విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఇక దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here