ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ఆమోదం తెలిపిన సీఎం జగన్, అధికారులకు కీలక ఆదేశాలు

CM YS Jagan Approves Formation of New Districts in AP Gives Key Directions to Authorities, CM YS Jagan Approves Formation of New Districts in AP, AP CM YS Jagan Gives Key Directions to Authorities, AP New Districts To Be Official On April 4 Says CM Jagan Mohan Reddy, AP Cabinet Approves Formation of 26 New Districts Declaration on April 4th, AP Cabinet Approves Formation of 26 New Districts, 26 New Districts Declaration on April 4th, AP Cabinet, 26 New Districts, New District Formation, reorganisation of New districts, new districts Declaration on April 4th, New districts in AP Declaration on April 4th, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Andhra Pradesh, new districts should be formed by Ugadi, New districts in AP to be formed by Ugadi, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, AP CM To Review New District Formation On March 30, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, 13 new districts, new districts In AP, AP new districts, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పా టుపై క్యాంప్ కార్యా లయంలో సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం సహా పలు అంశాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణకు మహూర్తం ఖరారు చేసి, సీఎం ఆమోదం తెలిపారు. అలాగే ఏప్రిల్ 6న వాలంటీర్లకు సత్కా రం, ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ముందుగా కొత్తజిల్లాల ఏర్పా టు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎంకు సీఎస్ సహా, ఇతర ఉన్నతాధికారులు వివరించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామని అధికారులు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్లు సిఫార్సులు చేశారని, సిబ్బంది విభజన, వారికి పోస్టింగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు అన్నింటిని పరిగణలోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు. వీటిని పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారుచేసినట్టు చెప్పారు. కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ కూడా తయారుచేసినట్టు అధికారులు తెలిపారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారుచేశామని, సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేశామని, లేనిచోట ప్రైవేట్ భవనాలను అద్దెప్రాతిపదికిన తీసుకున్నామని అన్నారు.

కొత్త జిల్లాలపై అధికారులకు సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు:

అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ కొత్త జిల్లాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. “సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యా లను కొత్తజిల్లాలతో అనుసంధానం చేయాలి. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మా ణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తిచేయాలి. కనీసంగా 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలి. కలెక్టర్ తో పాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకేసముదాయంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా వీరి క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ఈ భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలి. పదికాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలి. ప్రస్తుతం అద్దెభవనాలు తీసుకున్న జిల్లాల్లో, కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వా లి” అని అధికారులకు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =