మరోసారి భేటీ కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Chandrababu, Pawan Kalyan, TDP, Janasena, Palakollu, general elections, vijayawada, YSRCP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Chandrababu, Pawan Kalyan, TDP, Janasena

ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ తెలుగు దేశం-జనసేన పార్టీలు వడివడిగా ముందుకు కదులుతున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం రెడుసార్లు సమావేశం అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌.. సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు 35 స్థానాలను కేటాయించారట. ఈ మేరకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఓ జాబితా కూడా నెట్టింట్లో వైరలవుతోంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సమావేశం కానున్నారట. ఆ రోజు జనసేన-టీడీపీలకు కీలకం కానుందని తెలుస్తోంది.

అవును.. ఫిబ్రవరి 8న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మరోసారి భేటీ కానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చిన నేతలు.. పార్లమెంట్ నియోజకవర్గాలపై ఆరోజు చర్చించనున్నారట. ఆ తర్వాత తెలుగుదేశం-జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతన్నాయి. ఒకవేళ ఆరోజు కాకపోతే ఫిబ్రవరి 12న పాలకొల్లులో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగ సభలో జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.

అదే పాలకొల్లు సభలో ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు ఇరువురు నేతలు కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తుండగా.. 8న జరగబోయే సమావేశంలో మేనిఫెస్టోను కూడా ఫైనల్ చేయనున్నారట. అలాగే అదేరోజున నుంచి ఉమ్మడి ప్రచార షెడ్యూల్‌ను అమలు చేయబోతున్నారట. మొత్తానికి చూసుకుంటే ఫిబ్రవరి 12 తర్వాత ఏపీ రాజకీయాలు కంప్లీట్‌గా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు జనసేన పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఓ జాబితా వైరలవుతోంది. ఆ జాబితా ప్రకారం.. రాజోల్, అమలాపురం, పిఠాపురం, రాజానగరం, విశాఖ సౌత్, కాకినాడ రూరల్, ఉంగుటూరు, దర్శి, అనంతపూర్, రాజమండ్రి, నెల్లిమర్ల, తెనాలి, నరసాపురం, భీమవరం, రైల్వే కోడూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్-వెస్ట్, ఎలమంచిలి, పెందుర్తి, అవనిగడ్డ, గాజువాక, భీమిలి, పెడన, నిడదవోలు, ఏలూరు, తణుకు, పి.గన్నవరం, రాజంపేట, తిరుపతి, నెల్లూరు అర్బన్/రూరల్, మదనపల్లె, కైకలూరు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =