తెలంగాణలో ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం

Telangana Home Minister Mahmood Ali Says Last Date for Discount on Pending Challans Extended to April 15, April 15 Is The Last Date for Discount on Pending Challans, Discount on Pending Challans, Last Date for Discount on Pending Challans, Last Date for Discount on Pending Challans Extended to April 15, Telangana Home Minister Mahmood Ali Statement on Online Traffic Challan Payment and Discounts, Telangana Home Minister Mahmood Ali Statement on Online Traffic Challan Payment, Telangana Home Minister Mahmood Ali Statement on Online Traffic Challan Discounts, Telangana Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali, Mahmood Ali, Telangana Home Minister, Telangana, Special Discount on Pending E-Challans, Pending E-Challans, E-Challans, huge discounts on pending traffic challans, traffic challans, Telangana Home Minister Challan Discount, Hyderabad Traffic Challan Discount, Traffic Challan Discount, Challan Discount, traffic violation challan, challan, Challan Discount, Discount, Mango News, Mango News Telugu,

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందని, మరియు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రంలో విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు రావడం వలన, ప్రజల వద్ద నుండి వచ్చిన స్పందన మరియు విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి మరో పదిహేను రోజుల పాటు అనగా ఏప్రిల్ 15, 2022 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో (https://echallan.tspolice.gov.in/publicview/) ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కోరారు. బకాయిలు చెల్లింపు కోసం మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చు.

వివిధ రకాల వాహన యజమానులకు రాయితీ వివరాలు:

  • 2 వీలర్/3 వీలర్- 25% కడితే, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ
  • ఆర్టీసీ డ్రైవర్స్ – 30% కడితే, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ
  • ఎల్ఎంవీ/హెఛ్ఎంవీ – 50% కడితే, మిగతా బ్యాలవ్స్ 50% మాఫీ
  • తోపుడు బండ్ల వ్యాపారులు – 20% కడితే, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ
  • నో మాస్క్ కేసులు – రూ.100 కడితే, మిగతా బ్యాలన్స్ రూ. 900 మాఫీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =