అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

AP Assembly Winter Sessions, Assembly Winter Sessions, Assembly Winter sessions 2019, Govt Introduced Three Bills, latest political breaking news, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రెండో రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంది. నాణ్యమైన బియ్యం సరఫరా, రాష్ట్రంలో ఉల్లి ధరలు, రాజధాని నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్ ఆదాయపరిస్థితులు, ఇతర అంశాలపై చర్చను కొనసాగించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ – టీడీపీ సభ్యుల మధ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు – రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి కోడాలి నాని మధ్య ఆసక్తికర వాదనలు కొనసాగాయి. ఈ రోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ బిల్లులను ప్రవేశపెట్టింది.

ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన పలు అంశాల బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరో వైపు శాసనమండలిలో కూడా వివిధ అంశాలపై వాడీవేడిగా చర్చ సాగింది. గ్రామ సచివాలయాలపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని మంత్రులు డిమాండ్ చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =