భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అలాగే వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆయా చోట్ల ప్రవాహం ఎక్కువుగా ఉండే రిజయర్వాయర్లు, చెరువులు, ఇతర నీటివనరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ కోసం ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 5 =