47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం – సీఎం వైఎస్ జగన్‌

CM YS Jagan Mohan Reddy Addresses Virtually on Final Day of National Labour Conference at Tirupati, Jagan Addresses Labour Conference Virtually, AP CM YS Jagan Addresses Labour Conference, Tirupati National Labour Conference, Mango News, Mango News Telugu, National Labour Conference, AP CM YS Jagan Mohan Reddy, National Labour Conference Latest News And Updates, Tirupati News And Live Updates, Andhra Pradesh News, Tirupati, YSR Congress Party, AP CM YS Jagan Mohan Reddy,

47వ జాతీయ కార్మిక సదస్సుకి తిరుపతి వేదిక కావడం ఏపీకి గర్వకారణం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం సదస్సు చివరి రోజున వర్చువల్‌గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి జాతీయ కార్మిక సదస్సులో ముగింపు సందేశం ఇచ్చారు. గురువారం ప్రారంభమైన ఈ సమావేశాలకు మొత్తం 19 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే రాష్ట్రం తరపున చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు పలువురు సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ఇక ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన కోసం అలాగే పారిశ్రామికవేత్తలకు కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సదస్సుకి వేదికగా తిరుపతిని ఎంపిక చేసినందుకు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించబడిన ముఖ్యమైన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అలాగే మీ అందరికీ ఆ వేంకటేశ్వరుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =