ఏపీలో 7 గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో

Congress Manifesto with 7 Guarantees in AP,Congress Manifesto,Manifesto with 7 Guarantees,7 Guarantees in AP,AP Congress, Congress menifesto, AP Elections, AP Congress,Mango News,Mango News Telugu,AP Congress Manifesto Latest News,AP Congress Manifesto Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
AP Congress, Congress menifesto, AP Elections, AP Congress

దక్షిణాదిలో ఒక్కో రాష్ట్రానికి గురిపెట్టి అధికారం చేజిక్కించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అంతకంటే ముందు కర్ణాటకలో అధికారం దక్కించుకుంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు ప్రకటించి గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే మంత్రాన్ని ఫాలో అయింది. ఇక్కడ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్‌కు అధికారాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను అమలు చేసే పనిలో పడ్డారు.

ఇక కాంగ్రెస్ నెక్స్ట్ ఫోకస్ ఏపీపై పెట్టింది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఏపీలో కూడా అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అక్కడ కూడా గ్యారెంటీల మంత్రమే ఫాలో అవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా కాకుండా.. ఏపీలో ఏడు గ్యారెంటీలు మేనిఫెస్టోలో చేర్చి ప్రకటించాలని ఆలోచిస్తోంది. ప్రకటించబోయే గ్యారెంటీలపై ఏపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. అతి త్వరలోనే ఏడు గ్యారెంటీలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఏడు గ్యారెంటీలు ప్రకటించబోతున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టో రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని వివరించారు. ఏడు గ్యారెంటీలు ప్రజలకు ఉపయోగ పడేలా ఉంటాయని.. కచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికలపై కూడా రుద్రరాజు స్పందించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. మెజార్టీ స్థానాలను దక్కించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =