కేశినేని నానికి టికెట్ నిరాకరించిన టీడీపీ హైకమాండ్

TDP High Command Denied Ticket to Keshineni, TDP High Command Denied Ticket, Keshineni Ticket Denied, Keshineni Ticket, Kesineni Nani, Kesineni Srinivas, Telugu Desam Party, Chandrababu Naidu, Latest Keshineni Ticket Denied News, Keshineni Ticket Denied News Update, Ticket Denied News TDP, TDP Ticket News, Chandara Babu, TDP, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Kesineni nani, Kesineni srinivas, Telugu desam party, Chandrababu naidu

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంఛార్జ్‌ల మార్పు అంశం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది.  35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు జగన్మోహన్ రెడ్డి ఇంఛార్జ్‌లను మార్చేశారు. అయితే ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే రూట్‌లో వెళ్లడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట విజయవాడ ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నానికి టికెట్ ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించారు.

2009లో కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరుపున విజయవాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి గెలుపొంది లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచి టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా హైకమాండ్ పైనే పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు విజయవాడ టీడీపీ కీలక నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో కూడా నానికి విబేధాలు ఉన్నాయి.

అంతేకాకుండా తెలుగు దేశం పార్టీలో నారా లోకేష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి నాని పలుమార్లు తప్పుబట్టారు. చంద్రబాబు, నారా లోకేష్ తన మాటకు విలువ ఇవ్వడం లేదని పలుమార్లు బహిరంగంగానే నాని చెప్పారు. ఈక్రమంలో అటు హైకమాండ్ కూడా నానిని దూరం పెడుతూ వస్తోంది. ఇక ఎన్నికల ముంచుకొస్తున్న వేళ షాక్ ఇచ్చింది. ఈసారి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు ఈ విషయాన్ని స్వయంగా కేశినానికి వివరించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, నెట్టం రఘురాం, కొనకళ్ల నారాయణ గురువారం సాయంత్రం తనను కలిశారని నాని చెప్పుకొచ్చారు. 7న తిరువూరులో జరగబోయే సభకు ఇంఛార్జ్‌గా వేరేగా వారిని నియమించారని.. ఈ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చెప్పారని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని చంద్రబాబు నిర్ణయించారని వివరించారని తెలిపారు. చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తానని కేశినేని నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పరిణామంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =