అత్యంత చిన్న ప్రధాన మంత్రి కూడా అతనే..

Worlds First Gay PM, First Gay PM, Gay PM, The Youngest Prime Minister, The PM Of France Is Gabriel Attal, Latest First Gay PM News, First Gay PM News Update, Latest France Prime Minister, New France Prime Minister, Gabriel Attal, Prime Minister Gabriel Attal, France, France Political News, Political News, Mango News, Mango News Telugu
World's first 'gay' PM,the youngest Prime Minister, The PMr of France is Gabriel Attal

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ తీసుకున్న కీలక నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకూ తన కేబినేట్‌లోనే  విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గాబ్రియేల్ అట్టల్ ను తమ దేశ ప్రధానిగా నియమించడం హాట్ టాపిక్ అయింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంతో  ఫ్రాన్స్‌లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా  గాబ్రియేల్ అట్టల్ రికార్డు సృష్టించారు. త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మరోసారి  విజయం సాధించడానికి ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ..ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రధాన మంత్రిగా నియమితులైన గాబ్రియేల్ ఓ గే అంటే ఒక స్వలింగ సంపర్కుడు కావడంతో..గాబ్రియేల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

విదేశీయులను బహిష్కరించే గవర్నమెంట్ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఇమ్మిగ్రేషన్ చట్టంపై..ఈ మధ్య రాజకీయ గందరగోళం  ఏర్పడింది. దీని కారణంగా ఫ్రాన్స ప్రధానిగా ఉన్న ఎలిసబెత్ బోర్న్.. రెండు రోజుల క్రితం అంటే జనవరి 8న రాజీనామా చేశారు. 2027లో పదవీకాలం ముగియనున్న 46 ఏళ్ల మధ్యవర్తి అయిన ఇమ్యాన్యుయేల్  మాక్రాన్ రాబోయే రోజుల్లో గవర్నమెంటును ఏర్పాటు చేయనున్నారు.

2024  జూన్ లో యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. వరుసగా రెండోసారి కూడా తానే ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో మాక్రాన్ ఉన్నారు. దీనికోసం మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేయడానికి రెడీ అవుతున్నారు. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతోనే తాను బదులివ్వాలని మాక్రాన్ భావిస్తున్నారు.  దీనిలో భాగంగానే ఇప్పుడు గాబ్రియల్ అట్టల్‌ను  ప్రధానిగా నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =