ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో లేనట్టేనా?

Ambiguity Continues over Bus Services Between AP and Telangana

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల ప్రారంభానికి సంబంధించి ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల అధికారుల మధ్య విజయవాడలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఈ క్రమంలో జూన్ 24, బుధవారం నాడు హైదరాబాద్ లో అధికారుల మధ్య మరోసారి జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రోజురోజుకి రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, టీఎస్‌ ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో చర్చల్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడవడానికి మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశమునట్టు సమాచారం.

ముందుగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాకే ఆర్టీసీ బస్సులను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అధికారులు చర్చలు ప్రారంభించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here