షెడ్యూల్‌ కంటే ముందే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు?

TDP National General Secretary Nara Lokeshs Yuvagalam Padayatra Likely To End Before The Schedule,TDP National General Secretary Nara Lokesh,Nara Lokeshs Yuvagalam Padayatra,Yuvagalam Padayatra Likely To End Before The Schedule,Mango News,Mango News Telugu,Yuvagalam Padayatra schedule change,Nara Lokesh, Yuvagalam padayatra,TDP Leaders, Chandra Babu, Ap Politics ,TDP National General Secretary,TDP National General Secretary Latest News,TDP National General Secretary Latest Updates, Yuvagalam Padayatra Latest News,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన రాజకీయ దాడి పెంచాయి. అటు పవన్ వారాహి యాత్ర..ఇటు లోకేశ్ యువగళం యాత్రలతో పాటుగా చంద్రబాబు జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర షెడ్యూల్ కంటే ముందుగానే ముగించే ఆలోచన జరుగుతోంది. దీనికి అసలు కారణం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర షెడ్యూల్‌ మారే అవకాశం కనిపిస్తోంది. యాత్రను ముందుగానే ముగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండలో జరుగుతుంది. లోకేశ్ పోటీ చేయనున్న మంగళగిరి మీదుగా ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. జనవరి 27 నుంచి ప్రారంభించిన పాదయాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు పాటు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నిర్వహించాలని ముందుగా షెడ్యూల్‌ను పార్టీ నాయకత్వం రూపొందించింది. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి 1తో యాత్ర ముగించాల్సి ఉంది. మార్చిలో ఎన్నికల కోడ్‌తో పాటు షెడ్యూల్‌ కూడా రానుంది. ఈ సమయంలో లోకేశ్ యాత్రను కుదించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థుల ప్రకటన, యాత్ర రెండింటిపై పార్టీ దృష్టి సారించడం ఇబ్బందికరమవుతుందని భావిస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్‌లో రోజులు మాత్రం తగ్గుతాయని, కిలోమీటర్లలో మార్పు ఉండదని నాయకులు అంటున్నారు. 400 రోజులకు సగటున రోజుకు 10 కిలోమీటర్ల పాటు సాగాలని ముందుగా నిర్ణయించుకోగా, ప్రస్తుతం అది సగటున 15 కిలోమీటర్లు సాగుతోంది. ఇప్పటి వరకు 185 రోజులు పూర్తయింది. కొద్ది ప్రాంతాలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ లోకేశ్ యాత్రకు స్పందన బాగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో7 రోజులపాటు 4 నుంచి 5 నియోజకవర్గాలకే పరిమితం కానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం 60 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు కీలకం కావటంతో ఎక్కవ సమయం కేటాయించనున్నారు.

గోదావరి జిల్లాల్లో ముగిసిన అనంతరం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి నవంబరు చివరి నాటికి పూర్తి చేసేలా పార్టీ రూట్‌మ్యాప్‌ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జనసేనతో పొత్తు వేళ సీట్ల లెక్కలు..అభ్యర్థుల ఎంపిక కీలకం కానుంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పవన్‌ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న ప్రసంగాలతో ఉపయోగం ఉన్నా.. పవన్‌లో వస్తున్న మార్పు ..బీజేపీతో సంబంధాల అంశాన్ని టీడీపీ నిశితంగా గమనిస్తోంది. దీంతో, యాత్రలో వేగం పెంచి లక్ష్యం చేరుకొనేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల పొత్తులు..సీట్ల విషయంలో లోకేశ్ పాత్ర కీలకం కానుంది. ఈ కసరత్తు ఎన్నికల వేళ కీలకం కావటంతో యాత్రను కుదించే దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =