కొడాలి నానికి కంగారు షురూ..

New Equations in Gudivada, New Equations, Gudivada, Kodali NANI, YCP, TDP, YS Jagan, Pawan Kalyan, Chandrababu,Janasena, Gudivada Political News, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Gudivada, Kodali NANI, YCP, TDP, YS Jagan, Pawan Kalyan, Chandrababu,Janasena

రాజకీయాల్లో అధికారం  ఉంది కదా అని రెచ్చిపోతే..ఆ తర్వాత అదే పవర్‌ను పీక్కొని మరీ పక్కన పెట్టస్తారు ఓటర్లు. ఇప్పుడు ఏపీలో అదే సీన్ కనిపించబోతుందన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలంతా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాగా రెచ్చిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా వీరి నోటికి, చేతలకు అడ్డు చెప్పకపోతే ఏపీ సీన్ అంధకారం అయిపోతుందన్న ప్రచారం  జరుగుతుంది. అందుకే ఇలాంటివారిలో ముందుండే కొడాలి నానికి ఈ సారి ఎన్నికలలో షాక్ తప్పదన్న వార్తలు  గట్టిగా వినిపిస్తున్నాయి.

గుడివాడ తన అడ్డాగా చెప్పుకొని..మీసం మెలేసే నానిపై అక్కడి వారికి అస్సలు సదాభిప్రాయం లేదు. కాలం కలిసొచ్చో,ప్రత్యర్ధి బలంగా లేకపోవడమో కారణం తెలీదు కానీ ఓటర్లు  ఓటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నానిపై అక్కడ పూర్తి వ్యతిరేకత ఉన్నా అతనికే పట్టం కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది.  అయితే ఈ సారి నానికీ అక్కడ కొత్త లెక్కలు కంగారు పుట్టిస్తున్నాయట. తనకు ఎదురులేదన్న నమ్మకంతో ఉన్న నానీకి  కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ టెన్సన్లో పడేస్తున్నాయట.

ఇప్పుడు ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలతో గుడివాడలో ఎక్కడ చూసినా కొడాలికి వ్యతిరేక పవనాలే కనిపిస్తున్నాయి.ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి ఎన్నారై నేత వెనిగండ్ల రాము పక్కా వ్యూహంతో ముందుకు సాగిపోవడంతో కొడాలికి ఎలా ముందుకు వెళ్లాలో అస్సలు అర్ధం కావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ టికెట్‌ను ఆశించి నిరాశకు గురైన రావి వెంకటేశ్వరావుకు రాము పెద్దపీట వేయడంతో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టినట్లు అయింది. టెక్నికల్‌గా టికెట్ వెనిగండ్ల రాముదే అయినా..అప్రకటిత అభ్యర్థిగా రావినే ఆయన ముందు పెట్టడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరుస్తుంది.

నిజానికి రావి వెంకటేశ్వరరావు చాలా బలమైన నాయకుడు 2014లో నానికి గట్టి పోటీ ఇచ్చారు. కాకపోతే అప్పుడు వైసీపీ పవనాలు బలంగా వీయడంతో.. నానిని 11 వేల ఓట్లకే కట్టడి చేసినా విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయారు. తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నా.. ఈక్వేషన్‌బలంగా లేకపోవడంతో ఓడిపోయారు. ఈ బలాన్ని గుర్తించిన రాము..ఇప్పుడు రావినే ముందు పెట్టి ఆయనతో కలిసి ఉమ్మడిగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

దీంతోనే  గుడివాడ అడ్డాలో ఇప్పుడు సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్ తెరమీదికి వచ్చి నానీకి నిద్ర రానీకుండా చేస్తున్నాయి. బలమైన నేతలిద్దరూ కలిసికట్టుగా ..తమ ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్నారు. ఎక్కడా విభేదాలు లేకుండా ఎక్కడా చిన్న పొరపొచ్చాలు కూడా రానీకుండా.. కలిసి కట్టుగా నడుస్తూ ప్రజలకు చేరువవుతున్నా రు. దీంతో గెలుపు రాముదే ..ఎన్నికలు కేవలం టెక్నికల్ అంశమే అన్నట్లుగా గుడివాడ  నియోజకవర్గం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =