స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరో 7 అవార్డులను గెలుచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం

Minister Ktr Expressed Happiness Over Telangana Has Won 7 More Swachh Survekshan Awards,Minister Ktr, Telangana Won 7 More Awards,Swachh Sarvekshan Awards,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డులు-2022 కింద కేంద్రం తాజాగా 2వ మరియు 3వ ర్యాంకుల జాబితాను ప్రకటించగా, ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. దీంతో స్వచ్ఛ సర్వేక్షన్‌-2022 ర్యాంకింగ్స్‌లో 23 అవార్డులతో పాటుగా, ఇండియా స్వచ్ఛత లీగ్ కింద మరో మూడు అవార్డులు కలిపి తెలంగాణ రాష్ట్రం మొత్తం 28 అవార్డులను కైవసం చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం ఈ ఘనత సాధించడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, “కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మున్సిపల్ శాఖ మరో 7 అవార్డులను గెలుచుకోవడం సంతోషంగా ఉంది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో మొత్తం 26 అవార్డులను సాధించి తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ సిబ్బందికి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కు మరియు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణకు అభినందనలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.

తెలంగాణ మరో 7 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు (యూఎల్బీలు):

  1. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ – 3వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (3 నుంచి 10 లక్షల మధ్య జనాభా)
  2. కాగజ్‌నగర్‌ – – 2వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (50 వేల నుంచి 1 లక్షల మధ్య జనాభా)
  3. జనగామ – 3వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (50 వేల నుంచి 1 లక్షల మధ్య జనాభా)
  4. ఆమనగల్ – 2వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (25 వేల నుంచి 50 వేలు మధ్య జనాభా)
  5. గుండ్లపోచంపల్లి – 2వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (15 వేల నుంచి 25 వేల మధ్య జనాభా)
  6. కొత్తకోట – 3వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (15 వేల నుంచి 25 వేల మధ్య జనాభా)
  7. వర్ధనపేట – 2వ ఫాస్ట్ మూవింగ్ సిటీ – పాపులేషన్ కేటగిరి (15 వేల కంటే తక్కువ జనాభా).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − ten =