సంక్రాంతికి APSRTC స్పెషల్‌ సర్వీసులు

AP Government Appoints Working Group Over APSRTC Merger, APS RTC Special Bus Services for Sankranthi, APSRTC, APSRTC to operate 6970 special services for Sankranti, APSRTC to operate 7000 buses for Sankranti, APSRTC to run 6960 special bus services to major cities, APSRTC to Run 6970 Special Bus Services, APSRTC to Run 6970 Special Bus Services for Sankranti Festival, Mango News, RTC Special Bus Services for Sankranthi, Sankranti Festival, Sankranti Special Buses

తెలుగువారికి సంక్రాంతి అనేది అతిపెద్ద పండుగ.. ఎక్కడెక్కడివారంతా ఆ పండుగను సొంత ఊర్లకు వెళ్లి జరుపుకోవటం ఆనవాయితీ. మరో వారం రోజుల్లో మొదలవనున్న సంక్రాంతి సందడికి ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు తెలుగు వారందరూ. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సమయం‌లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు నిర్వహించనుంది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.

సంక్రాంతికి ముందు జనవరి 8వ తేదీ నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తుంది. వీటిలో 1,500 సర్వీసులు హైదరాబాద్‌కు కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. పండగ తరువాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా వెయ్యి బస్సులను కేటాయించారు. విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 7 =