అంబులెన్సులు ప్రారంభం, కరోనా పరీక్షలపై సీఎం జగన్ ను అభినందించిన పవన్ కళ్యాణ్

AP Ambulance Services, corona tests in ap, janasena chief, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Appreciates CM YS Jagan, Pawan Kalyan Appreciates CM YS Jagan over Ambulance Services, Pawan Kalyan Appreciates Corona Tests

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య వ్యవస్థలో ఇటీవల తీసుకొచ్చిన పలు మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

జూలై 1 న విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌ ఒకేసారిగా 1088 అధునాతన అంబులెన్స్‌లను ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటుంది. జూలై 3 నాటికీ రాష్ట్రంలో మొత్తం 9,71,611 కరోనా పరీక్షలను నిర్వహించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here