మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదారకం – పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Responds over Auto Catches Fire Incident in Sri Sathya Sai District, Pawan Kalyan Responds over Auto Catches Fire Incident in Sri Sathya Sai District, Janasena Chief Responds over Auto Catches Fire Incident in Sri Sathya Sai District, Auto Catches Fire Incident in Sri Sathya Sai District, Sri Sathya Sai District Auto Catches Fire Incident, Auto Catches Fire Incident, Sri Sathya Sai District, Auto Catches Fire in Sathya Sai District, 5 People Lost Lives, Sathya Sai District fire accident, Auto Catches Fire, Auto fire accident, Auto, Sathya Sai District fire accident News, Sathya Sai District fire accident Latest News, Sathya Sai District fire accident Latest Updates, Sathya Sai District fire accident Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైరులు తెగిపడి అయిదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అయిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలుపడి ఈ ఘోరం చోటు చేసుకొందని తెలిసింది. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం మనసుని కలచి వేసింది. ఆ కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి” అని అన్నారు.

“వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటా, మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అనే విషయం ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయి ఉంటున్నాయి. అలాగే జనావాసాల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు అయిదు నిండు ప్రాణాలు పోయాయి అని గుర్తుంచుకోవాలి. తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలి” అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − ten =