అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేంటి?, ఏపీ అసెంబ్లీలో పరిణామాలపై స్పందించిన పవన్ కళ్యాణ్

Janasena President Pawan Kalyan Responds over YSRCP and TDP Members Clash in AP Assembly Today,Janasena President Pawan Kalyan,Responds over YSRCP and TDP Members Clash,YSRCP and TDP Members Clash,Mango News,Mango News Telugu,AP Assembly Today,AP Assembly Latest News and Updates,AP Assembly Updates,AP Assembly Live Updates,AP Assembly Latest News,AP Assembly YSRCP and TDP Clash

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సోమవారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణ, సంబంధిత పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసెంబ్లీ అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేమిటి? అని ప్రశ్నిస్తూ, చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవి. ప్రజల గొంతు నొక్కే జీవో నెం.1 పై చర్చను కోరిన ప్రతిపక్ష టీడీపీ శాసన సభ్యులపై అధికార పక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఎమ్మెల్యేలు డి.బి.వి.స్వామి, జి.బుచ్చయ్య చౌదరిలపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఆక్షేపించాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“చట్ట సభలలో అర్ధవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తాం. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్న వాటిపై చర్చ చేయాలి. చర్చ కోసం పట్టుబడితే దాడి చేయడం భావ్యం కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ విధమైన దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైడింగ్ ఆఫీషియల్స్ మీద ఉంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 8 =