పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న

Minister KTR Straight Question to PM Modi on Skyrocketing Fuel Prices,Minister KTR Straight Question,Minister KTR Straight Question To Modi, Skyrocketing Fuel Prices,Mango News,Mango News Telugu,Minister KTR,Indian Prime Minister Modi,Narendra Modi,Indian Fuel Prices,Indian Petrol Prices,Petrol Prices in India,KTR Latest News and Updates

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఆకాశాన్ని అంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీకి సూటి ప్రశ్న అంటూ సంబంధిత వివరాలతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. “2014 మేలో క్రూడాయిల్/ముడి చమురు బ్యారెల్‌కు $107 గా ఉండగా, పెట్రోల్ ధర లీటరుకు రూ.71 ఉంది. 2023 మార్చిలో బ్యారెల్ ముడి చమురు ధర $65 గా ఉన్నప్పటికీ పెట్రోల్ ధర మాత్రం లీటరుకు రూ.110 గా ఉంది. క్రూడాయిల్ ధర పెరిగినప్పుడు ఇంధన ధరలు పెంచవలసి వస్తే, ధరలు తగ్గినప్పుడు వాటిని కూడా తగ్గించకూడదా?, ఈ ధర పెంపు వలన ఎవరు ప్రయోజనం పొందుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

అలాగే ఇంధన ధరల పెరుగుదలను అరికట్టేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుకునే వారికి సమాధానమంటూ, “ఎల్పీజీ ఇప్పటికే జీఎస్టీ కింద ఉంది. కానీ 8 ఏళ్లలో ధర రూ.400 నుంచి రూ.1200కి పెరిగింది. ఎల్పీజీ సిలిండర్ ధరలను నియంత్రించలేని నాన్ పెర్ఫార్మింగ్ అలయన్స్ (ఎన్‌పిఎ)కి పెట్రోలియం ఉత్పత్తులను ఎలా అప్పగించాలి?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 16 =