‘మా’ ఎన్నికలపై మంత్రి పేర్ని నాని ప్రకటన, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడి

12 IPS Officers Transferred In Andhra Pradesh, AP Minister Perni Nani, AP Minister Perni Nani Responds over MAA Elections, MAA Elections, MAA Elections 2021, MAA Elections News, Manchu Vishnu, Mango News, Minister Perni Nani Clarity On Movie Online Tickets Issue, Minister Perni Nani Responds to Pawan Kalyan Comments, Perni Nani Responds over MAA Elections, Tollywood’s MAA elections, Transport Minister Perni Nani

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌, నటుడు మంచు విష్ణు ప్యానెల్ లు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అలాగే ప్రచార పర్వంలో ఇరు ప్యానెల్స్వ్యా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలపై సోమవారం ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. ‘మా’ ఎన్నికలపై ఒక ప్రకటన విడుదల చేశారు.

“చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్నటువంటి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఆ ఎన్నికలపై ప్రభుత్వానికి ఏమాత్రం ఉత్సాహం, సంబంధం కానీ లేదని తెలియజేస్తున్నాం” అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =