నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా 7న నిరసన దీక్ష – పవన్ కళ్యాణ్

Janasena To Held Nirasana Deeksha On Dec 7th In Support To Nivar Cyclone Affected Farmers,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Janasena,Janasena Party,Nirasana Deeksha On Dec 7th,Nivar Cyclone Affected Farmers,Nivar Cyclone,Cyclone,Mango News,Mango News Telugu,Janasena To Held Nirasana Deeksha On Dec 7th,Janasena Party To Held Nirasana Deeksha On Dec 7th,Janasena party leader Pawan Kalyan,Protest on 7th In support of Affected Farmers - Pawan Kalyan,Janasena Nirasana Deeksha On Dec 7th,Janasena Support To Nivar Cyclone Affected Farmers

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ.35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాని పక్షంలో రైతాంగానికి మద్దతుగా ఈ నెల 7వ తేదీన అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపడుతుందని తెలిపారు. నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలో శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పంట నష్టం రూ.35 వేలు అన్నది జనసేన పార్టీ చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు ఎకరాకి రూ.35 వేల నుంచి రూ.40 వేలు సాయం చేయాలన్న డిమాండ్ వారి నుంచి వెలువడింది. వరుసగా మూడు పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బ తినడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాలి పోయిన పంటను తీయాలన్నా ఎకరాకి రూ.8 వేలు నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కళ్ల ముందే పంట ఉన్నా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ. 35 వేలు ఇస్తే ఎంతో కొంత బయటపడతారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు ఆ డిమాండ్ పెట్టాం. తక్షణ సాయం అందించడానికి 48 గంటల సమయం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనుషులు మనోనిబ్బరం కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తక్షణ సాయం అందించాలి” అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 15 =