నూతన పార్లమెంట్‌ భవనానికి డిసెంబర్ 10న శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ

PM Narendra Modi To Lay Foundation For New Parliament Building on December 10,Digital Design Of New Parliament Building,Pm Modi,PM Narendra Modi,Foundation Stone,New Parliament Building,First Look Of New Parliament Building,Mango0 News,Mango News Telugu,New Parliament Complex,New Parliment,New Parliament Building India,New Parliament Building India Design,Pm Modi New Parliament,New Parliament India,New Parliament Complex India,New Parliament Building For Mps,PM Narendra Modi To Lay Foundation For New Parliament Complex,Pm Modi December 10 Bhumi Pujan,Parliament Building First Look,Parliament Building,New Parliament Building News

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం నాడు వెల్లడించారు. ప్ర‌ధాని ‌మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరగనుందని తెలిపారు. సుమారు 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఎంపీకి ప్రత్యేక ఆఫీస్, అలాగే కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌, లైబ్రరీ, ఆరు కమిటీ రూమ్‌లు, ఎంపీల లాంజ్‌, డైనింగ్ ప్రదేశాలు, విశాల పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక భవిష్యత్ లో పెరిగే సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్ ల‌లో సిట్టింగ్ సామర్ధ్యాన్ని కూడా పెంచనున్నారు. మరోవైపు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే భవన నిర్మాణం అక్టోబర్ 2022 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =