ఓటర్ల నాడి ఎటు వైపుందో?

AP Assembly election 2024 ,Political scene in Kanigiri,voters?CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu,YSRCP,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
AP Assembly election 2024 ,Political scene in Kanigiri,voters?CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu,

ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్‌సభ పరిధిలో ఉన్న జనరల్ సీటు కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం. కనిగిరి,హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, వెలిగండ్ల, పామూరు,పెద్ద చెర్లోపల్లి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సంఖ్యాపరంగా చూసుకుంటే రెడ్డి సామాజికవర్గమే ఎక్కువగా ఉంటుంది.రెడ్డి సామాజిక వర్గం  తరువాత యాదవులు, కాపు, ఎస్సీ,కమ్మ సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య  ఉంటుంది. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ తరువాత నుంచీ చూసుకుంటే రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గ నాయకులే.. ఇక్కడి నుంచి ఎక్కువసార్లు విజయం సాధించారు.  అంతెందుకు 1952 నుంచీ కనుక చూసుకుంటే అప్పటి నుంచి  2019 వరకు 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా..తొమ్మిది సార్లు రెడ్డి అభ్యర్థులనే కనిగిరి వాసులు గెలిపించారు.

టీడీపీ ఆవిర్భవించిన తర్వాత చూసుకుంటే 2019 వరకు తొమ్మిదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ముక్కు కాశిరెడ్డి మూడు సార్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా తిరుపతి నాయుడు మూడుసార్లు విజయం సాధించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టగా..2014లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ ఆప్తుడు కదిరి బాబూరావు కాంగ్రెస్ అభ్యర్థికి చెక్ పెట్టి  విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో  కనిగిరి నియోజకవర్గాన్ని వైసీపీ తన ఖాతాలో కలిపేసుకుంది. వైసీపీ తరఫున బరిలో దిగిన బీసీ నేత బుర్రా మధుసూదన్ యాదవ్.. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు.  టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిపై 40 వేలకు పైగా ఓట్ల తేడాతో బుర్రా మధుసూదన్ యాదవ్ గెలిచారు.

ఆ సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా.. బీసీ అభ్యర్థిని బరిలో దించడం వైసీపీకి ప్లస్ పాయింట్ అయినట్లు విశ్లేషకులు భావించారు. ఒకే సమయంలో రెడ్డి, యాదవ సామాజిక వర్గ ఓటుబ్యాంకును ఆకట్టుకోవడంలో అప్పుడు వైసీపీ సక్సెస్ అయింది. అయితే అప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకుని కనిగిరి నుంచి పోటీ  చేసిన సీపీఐ అభ్యర్ధి మన్నేపల్లి లక్ష్మీ నారాయణకు 2,434 ఓట్లు పడగా.. బీజేపీకి 1,177 ఓట్లు పడ్డాయి.  ఈ సారి ఎన్నికల్లో  కూడా వైసీపీ నుంచి బీసీ అభ్యర్థే రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు టీడీపీ తరఫున పోటీ చేసి గత ఎన్నికలలో ఓడిపోయిన  ఉగ్ర నరసింహా రెడ్డికే చంద్రబాబు ఇప్పుడు కూడా  టికెట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ  ఎన్నికల్లో కనిగిరి ఓటరు నాడి ఎలా ఉంటుంది.. ఏ పార్టీని విజయం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 3 =