ఈ ముహూర్తం ఎవరికీ కలిసి వస్తుందో!

This Moment Comes Together For Anyone!,Chandrababu Vs Jagan,Rallies Kicks Off From March 27,Telugu News,Mango News,Mango News Telugu,Pawan Kalyan,TDP,Alliance,Vijayawada,TDP,TDP News,TDP Rally,TDP Party Latest News,YSRCP,YSRCP Latest News,YSRCP News,YSRCP Campaign,YSRCP Rally,Chandrababu News,Chandrababu Latest News,Chandrababu Live,Chandrababu Press Meet,Assembly Elections,Andhra Pradesh,TDP And YSRCP Rally on March 27,CM YS Jagan,CM YS Jagan News,CM Jagan,CM Jagan Election Campaign,Chandrababu Election Campaign,CM Jagan Live,CM Jagan Latest,Jagan And Chandrababu Election Campaign On March 27,Ys Jagan And Chandrababu Election Campaign From March 27th,Ys Jagan And Chandrababu Election Campaign

ఇప్పటివరకు ఒకటి ఇప్పటినుంచి ఒకటి.. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్స్‌కు వెళ్లింది. అటు భానుడు భగభగలు ఇటు చంద్రబాబు, జగన్‌ సభలతో వేడి మరింత రాజుకుంది. ‘సిద్ధం’ సభలతో హోరెత్తించిన జగన్‌.. ఈ నెల 27 నుంచి ‘మేము సిద్ధం’ అంటూ బస్సు యాత్ర చేయనున్నారు. నిన్నమొన్నటివరకు ప్రచార ప్లాన్‌ను ప్రకటించని టీడీపీ ఇప్పుడు అదే 27 నుంచి ప్రజల వద్దకు వెళ్లనుంది. దీంతో ఇద్దరూ 27 నుంచే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇది ప్రచారంలో జగన్‌కు ఇది సెకండ్‌ ఇన్నింగ్స్‌. సిద్ధం సభలకు జనాలు భారీగా వచ్చారు. దీంతో సిద్ధం సభలు కవర్‌  చేయని ప్రాంతాలపై జగన్‌ ఫోకస్‌ పెట్టారు. 27 నుంచి జరగబోయే ప్రచారంలో సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన వాటిలో జగన్ ర్యాలీలు చేయనున్నారు. మేము సిద్ధం సభలపై తొలి మూడు రోజుల షెడ్యూల్‌ను వైసీపీ ప్రకటించగా.. అటు టీడీపీ 27 నుంచి మార్చి 31 వరకు ప్రచారాల్లో పాల్గొననుంది.

చంద్రబాబు సభలకు ప్రజాగళం అని పేరు పెట్టుకున్నారు.  ప్రతి రోజూ 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి . 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పర్యటనతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత 28న రాప్తాడు, సింగనమల, కదిరి.. ఆ తర్వాత 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో జరిగే ప్రచార కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో విహారయాత్ర సాగి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు పర్యటనలతో ముగుస్తుంది.

ఈ నెల 27న  కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతోంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అదేరోజు సాయంత్రం ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇలా జగన్‌, చంద్రబాబు వరుస పెట్టి ర్యాలీలు, సభలతో దూసుకెళ్తున్నారు. ఇద్దరూ 27 నుంచే ఈ ప్లాన్‌ చేయడంతో ఈ డేట్‌ గురించి ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ తేదీ జగన్‌కు కలిసి వస్తుందని కొందరు.. ఇంకొందరు చంద్రబాబు విజయానికి కారణమవుతుందని అంటున్నారు. మరి చూడాలి.. ఈ లక్కీ డేట్ ఎవరికి కలిపి వస్తుందో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 18 =