ఏపీలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల జాబితా ఇదే …

56 Backward Classes corporation boards, 56 BC corporations to be set up in Andhra Pradesh, Andhra govt announces governing bodies for 56 BC Corporations, Andhra Pradesh Chiefs for 56 BC corporations, AP 56 BC Corporations, AP appoints chairpersons of 56 BC Corporations, AP govt appoints chairpersons for BC Corporations, Chairmans of 56 BC Corporations Appointed By AP Govt, List of Chairmans of 56 BC Corporations

రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వేగంగా అందేందుకు ఈ కార్పోరేషన్లు సహకరించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పోరేషన్లుకు నియమించిన ఛైర్మన్లు, డైరెక్టర్లను ఆదివారం నాడు ప్రకటించారు. ఒక్కో బీసీ కార్పోరేషన్‌కు ఒక చైర్మన్‌తో పాటుగా 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. చైర్మన్లు, డైరెక్టర్ల నియామక ప్రకటన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ మరియు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

56 బీసీ కార్పోరేషన్లకు చైర్మన్లు వీరే:

 • రజక కార్పోరేషన్ – రంగన్న – అనంతపురం
 • తొగట – గడ్డం సునీత – అనంతపురం
 • కురుబ – కోటి సూర్యప్రకాశ్‌ బాబు – అనంతపురం
 • కుంచిటి వక్కలిగ – డా.నళిని – అనంతపురం
 • పాల ఎకరి – టి.మురళీధర్ – చిత్తూరు
 • వన్యకుల క్షత్రియ – కె. వనిత – చిత్తూరు
 • ఈడిగ – కె.శాంతి – చిత్తూరు
 • ముదళియర్ – తిరుపతూర్ గోవిందరాజు సురేష్ – చిత్తూరు
 • అగ్నికుల క్షత్రియ – బందన హరి – తూర్పుగోదావరి
 • గాండ్ల – భవానీ ప్రియ – తూర్పుగోదావరి
 • పెరిక – పురుషోత్తం గంగాభవానీ – తూర్పుగోదావరి
 • అయ్యారక – రాజేశ్వరం – తూర్పుగోదావరి
 • కుమ్మరి శాలివాహన – పురుషోత్తం – గుంటూరు
 • కృష్ణ బలిజ/పూసల – కోలా భవాని – గుంటూరు
 • షేక్ – షేక్ యాసీన్ – గుంటూరు
 • వడ్డెర – దేవల్లి రేవతి – గుంటూరు
 • పద్మశాలీ – విజయలక్ష్మి – కడప
 • నూర్ బాషా దూదేకుల – అప్సరి ఫకూర్‌బి – కడప
 • నాయిబ్రాహ్మణ – సిద్దవటం యానాదయ్య – కడప
 • యాదవ – హరీష్‌కుమార్ – కడప
 • సాగర ఉప్పర – గనుగపేట రమణమ్మ – కడప
 • విశ్వ బ్రాహ్మణ – తోలేటి శ్రీకాంత్ – కృష్ణా
 • వడ్డెలు – సైదు గాయత్రి సంతోష్ – కృష్ణా
 • భట్రాజు – గీతాంజలి దేవి – కృష్ణా
 • గౌడ – మాడు శివరామకృష్ణ – కృష్ణా
 • వీరశైవ లింగాయత్ – రుద్రగౌడ్ – కర్నూలు
 • బెస్త – తెలుగు సుధారాణి – కర్నూలు
 • వాల్మీకి బోయ – డా.మధుసూదన్ – కర్నూలు
 • కుమి/కరికల భక్తుల – శారదమ్మ – కర్నూలు
 • ముదిరాజ్ – వెంకటనారాయణ – నెల్లూరు
 • ముస్లిం సంచార జాతుల – సయ్యద్ ఆసిఫా – నెల్లూరు
 • జంగం – ప్రసన్న – నెల్లూరు
 • బొందిలి – కిషోర్ సింగ్ – నెల్లూరు
 • చట్టాడ శ్రీవైష్టవ – మనోజ్‌కుమార్ – ప్రకాశం
 • దేవాంగ – సురేంద్రబాబు – ప్రకాశం
 • మేదర – లలిత నాంచారమ్మ – ప్రకాశం
 • ఆరెకటిక – దాడ కుమారలక్ష్మి – ప్రకాశం
 • కళింగ -పేరాడ తిలక్ – శ్రీకాకుళం
 • రెడ్డిక – లోకేశ్వరరావు – శ్రీకాకుళం
 • శ్రీసైన – చీపురు రాణి – శ్రీకాకుళం
 • పోలినాటి వెలమ – కృష్ణవేణి – శ్రీకాకుళం
 • కళింగ కోమటి/ కళింగ వైశ్య – సూరిబాబు – శ్రీకాకుళం
 • కురకుల/పొండర – రాజపు హైమావతి – శ్రీకాకుళం
 • గవర – బొడ్డేడ ప్రసాద్ – విశాఖపట్నం
 • నగరాల – పిల్లా సుజాత – విశాఖపట్నం
 • మత్స్యకార – కోలా గురువులు – విశాఖపట్నం
 • యాత – పి.సుజాత – విశాఖపట్నం
 • నాగవంశం – బొడ్డు అప్పలకొండమ్మ – విశాఖపట్నం
 • కొప్పుల వెలమ – నెక్కల నాయుడు బాబు – విజయనగరం
 • శిష్ట కరణం – మహంతి అనూష పట్నాయక్ – విజయనగరం
 • తూర్పు కాపు/గాజుల కాపు – మామిడి శ్రీకాంత్ – విజయనగరం
 • దాసరి – రంగుముద్రి రమాదేవి – విజయనగరం
 • సూర్య బలిజ – శెట్టి అనంతలక్ష్మి – పశ్చిమగోదావరి
 • అత్రిరాస – ఎల్లా భాస్కర్‌ రావు – పశ్చిమగోదావరి
 • శెట్టి బలిజ – తమ్మయ్య – పశ్చిమగోదావరి
 • అత్యంత వెనుకబడిన వర్గాల – వీరన్న – పశ్చిమగోదావరి

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + fifteen =