నారా లోకేష్‌కు స్వల్ప ఊరట..

Little relief for Nara Lokesh,Lokesh Little relief,relief for Nara Lokesh,Mango News,Mango News Telugu,Nara Lokesh, AP High Court orders, arrest, AP High Court , Lokesh, Chandra Babu, Skill Devolopment Casem fibernet Case,Big Relief For N Chandrababu Naidu,Nara Lokesh Speaks to Arnab,Andhra IT minister Nara Lokesh,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Nara Lokesh News and Live Updates,Nara Lokesh News Today

చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి లోకేష్ అరెస్ట్‌పైన కూడా ఊహాగానాలు అందుకున్నాయి. దీనికి తగ్గట్లే టీడీపీ నేతలంతా ఒక్కొక్కరు ఇక లోకేష్ అరెస్టే తరువాయి అంటూ మైక్‌ల ముందుకు వచ్చి మరీ చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ వర్గాలు కూడా లోకేష్ అరెస్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేయడంతో.. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా టీడీపీ నేత నారా లోకేష్‌కు స్వల్ప ఊరట లభించినట్లయింది. అక్టోబర్ 4 వరకు లోకేష్‌ను అరెస్టు చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు, ఫైబర్‌నెట్‌ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లోకేష్ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్‌ను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

స్కిల్, ఫైబర్ నెట్ కేసులో లోకేష్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని లోకేష్ తరఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు . దీంతో పాటు ఫైబర్ నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.అయితే లోకేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది.

లోకేష్ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు.. విచారణకు సహకరించాలని ఆయనకు ఆదేశించింది. దీంతోపాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు 41A నోటీసులను ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14 గా ఉన్న లోకేష్‌కు…ఆ నోటీసులను ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఐడీ.. లోకేష్‌ను విచారించేందుకు నోటీసులు ఇవ్వనున్నారు.

మరోవైపు ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. వచ్చేనెల 4కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =