కర్ణాటక ‘మేకెదాటు’ పాదయాత్రపై కరోనా పంజా

Karnataka Congress to Postpone Mekedatu Padayatra Amid Rising Covid-19 Cases, Karnataka Congress, Karnataka Congress Party, Mekedatu Padayatra, Karnataka Congress to Postpone Mekedatu Padayatra, Karnataka Congress to Postpone Mekedatu Padayatra Due To Rising Of Covid-19 Cases, Mekedatu Padayatra Postponed, Mekedatu Padayatra Latest Updates, Mekedatu Padayatra Live Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant,

కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన ‘మేకెదాటు’ పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను తలపెట్టింది కాంగ్రెస్. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొంటున్న చాలామందికి కరోనా సోకడం పార్టీలో ఆందోళన నింపింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత వీరప్ప మొయిలీ, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, ఎమ్మెల్యే లక్ష్మి, బెంగళూరు మాజీ మేయర్ మల్లికార్జున్ తదితరులు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ఈ పాదయాత్రను ఆపివేస్తున్నట్లు ప్రకటించారు.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేలమందితో పాదయాత్ర నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు మొదటినుంచీ దీనిని ‘సూపర్ స్ప్రెడెర్ ర్యాలీ’ గా అభివర్ణిస్తున్నారు. దీంట్లో భాగంగానే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ మరియు ప్రతిపక్ష నేత సిద్దరామయ్య సహా 60 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర హైకోర్టు కూడా దీనిపై స్పందించింది. దీనికి అనుమతి ఎలా ఇచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా. ఈ తరుణంలోనే ఈ పాదయాత్రను నీలిపివేస్తున్నట్లు ప్రకటించింది కర్ణాటక కాంగ్రెస్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =