కరోనా ఎఫెక్ట్ : ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం

Mango News, Schools in Uttar Pradesh shut till 15 February, Schools shut till Feb 15, UP Govt Decide to Close Schools till February 15 Due to Covid-19 Situation, UP Schools Closed till February 15 due to COVID, UP Schools Reopening Postponed Again, UP schools to remain closed till February 15, UP schools to remain closed till February 15 amid surge, Uttar Pradesh schools shut till February, Uttar Pradesh schools shut till February 15, Uttar Pradesh schools to be closed till Feb 15

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల మూసివేతపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఫిబ్రవరి 15 వరకు మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి వలన ఫిబ్రవరి 15 వరకు పాఠశాలల్లో బౌతికంగా క్లాసుల నిర్వహణ ఉండదని, అయితే బోర్డు పరీక్షల దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

ముందుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో జనవరి 23 వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం జనవరి 30 వరకు పొడిగించారు. తాజాగా కరోనా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఫిబ్రవరి 15 వరకు పాఠశాలల మూసివేతను పొడిగిస్తూ యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఇప్పటివరకు 19,80,239 కరోనా కేసులు నమోదవగా, 18,76,791 మంది రికవరీ అయ్యారు. ఈ వైరస్ బారినపడి 23,106 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 80,342 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 5 =