ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మొద్దు : ఎమ్మెల్యే కాకాని

Anandaiah Ayurvedic Medicine, Anandayya Medicine, Ayurvedic Medicine at Krishnapatnam, Ayurvedic Medicine For COVID-19, Don’t Believe Middle Man Over Anandayya Medicine, Kakani Govardhan Reddy Gives Clarity On Anandayya Medicine, Mango News, MLA Kakani Govardhan Reddy, MLA Kakani Govardhan Reddy Addresses Media, MLA Kakani Govardhan Reddy Addresses Media Over Anandayya Medicine, MLA Kakani Govardhan Reddy Appeals People to Don’t Believe Middle Man Over Anandayya Medicine

ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేస్తే, ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని సర్వేపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆనందయ్య మందు పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే మందు తయారీ, పంపిణీ విషయంలో వైఎస్సార్సీపీకి గాని, రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఎటువంటి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. మందు పంపిణీకి సంబంధించి కొంతమంది ఆనందయ్యతో సంబంధం లేకుండా, ఆయనకు తెలియకుండా కొన్ని వెబ్ సైట్స్ తయారుచేయడం, పార్టీల రంగులు వేయడం ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారిపైనా చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుందన్నారు. ఇక ఆనందయ్య మందు ద్వారా సహాయం పొందిన వారు వస్తు రూపంలో గాని, ఆర్థికంగా గాని సహాయం అందించాలనుకుంటే వారు నేరుగా ఆనందయ్యకు అందజేయాలి తప్ప, మధ్యలో మరెవ్వరికీ, ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =