తెలంగాణ : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌

Covid-19 Vaccination, COVID-19 vaccination Priority for students going abroad, Mango News, Special Covid Vaccination Drive, Special Covid Vaccination Drive for Students Going Abroad, telangana, Telangana Govt, Telangana Govt Decides to Start Special Covid Vaccination Drive, Telangana Govt Decides to Start Special Covid Vaccination Drive for Students Going Abroad, Telangana to vaccinate students going abroad, vaccination drive for students travelling abroad

విద్యాభ్యాసం కోసం రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సౌకర్యార్ధం, వారి అడ్మిషన్ లెటర్ ఆధారంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని ఇటీవలే తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలని వైద్యశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి ప్రత్యేకంగా వాక్సినేషన్ కార్యక్రమం వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జూన్ 5 నుండి హైదరాబాద్ లోని నారాయణగూడలో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) లో వారికీ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు సంబంధించిన లింక్ https://www.health.telangana.gov.in వెబ్ సైట్ లో జూన్ 4వ తేదీనుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అర్హతగల విద్యార్థులుకు వ్యాక్సినేషన్ కోసం జూన్ 5వ తేదీ నుంచి స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 7 =