పాక్ గగనతలంలో, భారత విమానాలపై ఆంక్షల ఎత్తివేత

Pakistan Opens Its Airspace For Indian Flights,Mango News,Pakistan Reopens Airspace,Pakistan Breaking News,Indian Flights,Pakistan Airspace,Balakot Strike,Pakistan Latest News

పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధారిటీ జూలై 16 న 12.41 గంటల నుంచి భారతదేశ వాణిజ్య విమానాలపై వారి గగనతలం లో విధించిన ఆంక్షలను తొలగించింది. ఇకపై పాకిస్తాన్ గగనతలం భారత్ విమానాలకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఫిబ్రవరి 26 న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) బాలకోట్‌లోని జైష్ ఇ మొహమ్మద్ (జెఇఎమ్) శిక్షణా శిబిరంలో వైమానిక దాడులు నిర్వహించింది,ఈ దాడుల తరువాత ఏర్పడిన ఉద్రికత పరిస్థితుల మధ్య, పాకిస్తాన్ ప్రభుత్వం తన గగనతలం ద్వారా భారత విమానాలు వెళ్ళేందుకు అనుమతి నిషేధించింది. దీంతో మన దేశం నుండి యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, ఇతర యూరోప్ దేశాలకు వెళ్లేందుకు విమానాల రూట్ మార్చారు, దాదాపు ఐదు నెలల తరువాత ఈ ఆంక్షలను ఎత్తివేస్తూ, పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

భారతీయ విమానాలను పాక్ గగనతలం లో నిషేధించడంతో విమానయాన సంస్థలన్నీ నష్టాలు చవిచూశాయి, ఈ నిర్ణయం వారికీ పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.పాకిస్తాన్ నిర్ణయంతో ఎయిర్ ఇండియా జులై 2 వ తేదీ వరకు దాదాపుగా రూ. 491 కోట్లు నష్టపోయింది, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో, ఇతర విమానాయాసంస్థలు కూడ పెద్ద మొత్తంలో నష్టపోయినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక నివేదికలో తెలిపారు. పాకిస్తాన్ సైతం ఈ నిర్ణయం వలన బాగా నష్టపోయినట్టు తెలిసింది. పాకిస్తాన్ నిర్ణయంపై భారత్ స్పందిస్తూ, వెంటనే అన్ని విమానయాన సర్వీసులను పునరుద్ధరిస్తునట్టు ప్రకటించారు.

 

[subscribe]
[youtube_video videoid=m8Ngkh2WCGI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + eight =