బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టిన యనమల

AP Minister Buggana Rajendranath Reddy, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Yanamala Ramakrishnudu Comments On AP Minister Buggana Rajendranath Reddy, Yanamala Ramakrishnudu Criticizes AP Minister, Yanamala Ramakrishnudu Criticizes AP Minister Buggana, Yanamala Ramakrishnudu Criticizes AP Minister Buggana Rajendranath Reddy

టీడీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ రోజు అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సింగపూర్ లో పర్యటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను యనమల తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయలేమంటూ బుగ్గన చేతులెత్తేశారని విమర్శించారు. సింగపూర్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినే విధంగా, పెట్టుబడులు అడ్డుకునేలా వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి నిధులు లేవని ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

రాజధాని నిర్మాణానికి నిధులు లేవని సింగపూర్ సమావేశంలో మంత్రి బుగ్గన చెప్పడం వైసీపీ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసిందని యనమల విమర్శించారు. కొత్తగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటున్నారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అంతా వికేంద్రీకరణే అని చెప్పారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని యనమల పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గృహ నిర్బంధంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఒక మాజీ సీఎం ఇంటి గేట్లకు తాళ్లు కట్టడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. సెక్షన్ 140, సెక్షన్ 30 లేని చోట కూడ టీడీపీ నాయకులను నిర్బంధించారని, ప్రశాంతంగా చేయాలనుకున్న ఆందోళలను పోలీస్ బలగాలతో అణిచి వేయాలని చూసారని మండిపడ్డారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here